-
-
Updated :
20 November 2025 02:36 PM
కాకినాడ(మనసులో మాట) నవంబర్ 20: కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునః ప్రారంభించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని అడ్డాల వద్ద నిరసన తెలియజేయాలని యూనియన్ పిలుపు నిచ్చింది. ఈ పిలుపులో భాగంగా గురువారం ఉదయం తెల్లవారుజాము నుండి కార్మికుల అడ్డాల వద్ద కిషోర్ అధ్యక్షతన బోర్డును అమలు చేయాలని సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని నిరసనలు తెలియ చేసారు. ఈ నిరసనలకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పున ప్రారంభించి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్మికుల అడ్డాలు కొండయ్యపాలెం శాంతినగర్ గుడారిగుంట లక్ష్మీ నగర్ సర్పవరం గ్లాస్ హౌస్ సెంటర్ తదితర కార్మికులు అడ్డాల వద్ద నిరసనలు తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు.నిర్మాణ రంగంలో వసూలు చేస్తున్న ఒక్క శాతం సెస్ నిధులను దోచుకోవడం ఆపండి అనిఆ ఒక్క శాతం సెస్ నిధులు భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు చేయాలని పథకాల అమలు చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు పని ప్రదేశాల్లో పనిచేస్తుండగా ప్రమాదాలు జరిగి మృతి చెందిన పనికి వెళ్లే సమయాల్లో మార్గ మధ్యంలో యాక్సిడెంట్లకు గురై మృతి చెందిన కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నారని సాధారణ మరణానికి రెండు లక్షలు మంజూరు చేస్తున్నారని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయాలని డెలివరీ మ్యారేజ్ గిఫ్ట్ పథకాలన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని 1996 నుండి అనేక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాటాల నిర్వహించామని పోరాటాలు ఫలితంగా 2009 నుండి సంక్షేమ బోర్డు అమల్లోకి వచ్చిందని గత ప్రభుత్వం ఈ బోర్డును అమలు చేయలేదని కొట్లాది రూపాయల నిధులు సెస్ నిధులు వసూలు చేస్తున్న కార్మికులకి మాత్రం పథకాల అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ఐదు నెలల గడుస్తున్న భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డుని అమలు చేయడం లేదని అనేక సార్లు ధర్నాలు ఆందోళన రాష్ట్ర రకంగా నిర్వహించిన చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా చందంగా పట్టించు కోవడంలేదని ఆయన అన్నారు. భవనిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలని హాస్పిటలైజేషన్ పథకాల అమలు చేయాలని అనారోగ్యానికి గురైన నిర్మాణ కార్మికులు తాపీ మేస్త్రీలు కూలీలు పెయింటర్స్ వడ్రంగి పనివారు టైల్స్ గ్రానైట్ ఎలక్ట్రికల్ పి ఓ పి తదితర రంగాల కార్మికులు సిమెంట్ తో కాలం పని చేయడం ప్రమాదకరమైన కెమికల్స్ పెయింట్స్ తో పనిచేయడం మిషనరీలతో పని చేయడం తదితర రంగాలలో పనిచేయ చేసే కార్మికులు టీవీ క్యాన్సర్ ఆస్మా, ఊపిరితిత్తులు కిడ్నీ దీర్ఘకాల వ్యాధులకు గురై తీవ్రతరంగా బాధపడుతున్నారని అన్నారు. అటువంటి వారందరికీ హాస్పిటలైజేషన్ పథకాన్ని అమలు చేసి వారిని ఆదుకోవాలని ఆయన అన్నారు.ఒక్క శాతం సెస్ నిధులు భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదాల కొరకే వసూలు చేస్తున్నారని ఆ సెస్ నిధులు భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు చేసే వరకు బోర్డు ద్వారా పథకాల అమలు చేసే వరకు ఈ కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తూనే ఉంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సోహెల్ ఖాన్ సూరిబాబు రమేషు బాలకృష్ణ వెంకటరమణ కృష్ణ గురుమూర్తి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.